షిప్‌యార్డులో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం

ABN , First Publish Date - 2021-05-30T05:35:35+05:30 IST

విశాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డులో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆ సంస్థ డైరెక్టర్‌ పర్సనల్‌ గుప్తా శనివారం ప్రారంభించారు.

షిప్‌యార్డులో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ ప్రారంభం
షిప్‌యార్డులో కొవిడ్‌ వ్యాక్సిన్‌ వేస్తున్న దృశ్యం

మల్కాపురం, మే 29 : విశాఖ హిందూస్థాన్‌ షిప్‌యార్డులో కొవిడ్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమాన్ని ఆ సంస్థ డైరెక్టర్‌ పర్సనల్‌ గుప్తా శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంస్థలోని ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, ఎమ్‌డీ సొసైటీ సభ్యులు, మాజీ సభ్యులకు కూడా వ్యాక్సిన్‌ వేసే కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ఈ అవకాశాన్ని వారంతా వినియోగించుకోవాలని ఆయన కోరారు. 

Updated Date - 2021-05-30T05:35:35+05:30 IST