కొవిడ్‌ సోకిందని... రైతు బలవన్మరణం

ABN , First Publish Date - 2021-05-03T04:37:16+05:30 IST

కొవిడ్‌ సోకిందనే మనస్తాపంతో ఓ రైతు రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

కొవిడ్‌ సోకిందని... రైతు బలవన్మరణం
సూర్యనారాయణ (ఫైల్‌)

రైలు కిందపడి ఆత్మహత్య కశింకోట, మే 2: కొవిడ్‌ సోకిందనే మనస్తాపంతో ఓ రైతు రైలు కింద పడి ఆదివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషాదకరమైన సంఘటనకు సంబంధించిన తుని రైల్వే ఎస్‌ఐ అబ్దుల్‌మారూఫ్‌ అందించిన వివరాలిలా ఉన్నాయి.  మండలంలోని నూతనగుంటపాలెం శివారు త్రిపురవానిపాలెం గ్రామానికి చెందిన చప్పా సూర్యనారాయణ (58) ఆరోగ్యం బాగోకపోవడంతో శనివారం అనకాపల్లిలోని ఓప్రైవేటు ఆస్పత్రికి వెళ్లాడు. అక్కడ అతడికి కొవిడ్‌  పరీక్షలు నిర్వహించిన వైద్యులు పాజిటివ్‌గా నిర్థారించారు. దీంతో మనస్తాపం చెందిన సూర్యనారాయణ బయ్యవరం- నర్సింగబిల్లి రైల్వేస్టేషన్ల మధ్య రైలుకింద పడి  ఆత్మహత్యకు పాల్పడాడు.  మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తుని రైల్వే ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్‌ఐ మారూఫ్‌ తెలిపారు.  

Updated Date - 2021-05-03T04:37:16+05:30 IST