టీడీపీ నాయకుల జోలికి వస్తే ఖబడ్దార్
ABN , First Publish Date - 2021-11-21T06:16:00+05:30 IST
టీడీపీ నాయకుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు హెచ్చరించారు.

టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద
నెహ్రూచౌక్‌లో టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా
అనకాపల్లి టౌన్, నవంబరు 20: టీడీపీ నాయకుల జోలికి వస్తే ఉపేక్షించేది లేదని టీడీపీ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు బుద్ద నాగజగదీశ్వరరావు హెచ్చరించారు. టీడీపీ అధినేత, మాజీ సీఎం నారా చంద్రబాబునాయుడు కుటుంబ సభ్యులపై అసెంబ్లీలో చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా శనివారం నెహ్రూచౌక్‌లోని అంబేడ్కర్ విగ్రహం వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ సందర్భంగా బుద్ద మాట్లాడుతూ అసెంబ్లీలో మంత్రులు, ఎమ్మెల్యేలు చంద్రబాబును హేళన చేస్తే సీఎం జగన్ అమితానందం పొందడం విచారకరమన్నారు. భజన చేసే నాయకులకు భూస్థాపితం తప్పదన్నారు. అలిపిరిలో ప్రమాదం జరిగినప్పుడు కూడా చంద్రబాబు బాధపడలేదని, వైసీపీ నాయకుల తీరుకు కన్నీరు పెట్టుకోవాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. అధికార దుర్వినియోగంతో పాలన సాగిస్తున్న వైసీపీ ప్రభుత్వానికి ప్రజలు తగిన బుద్ది చెబుతారన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోట్ని బాలాజీ మాట్లాడుతూ, అసెంబ్లీలో శుక్రవారం జరిగిన సంఘటన చీకటిరోజుగా అభివర్ణించారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ పార్లమెంట్ నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దిరెడ్డి వెంకటరమణ, నాయకులు దేవర శివయాదవ్, ఎం.సత్యనారాయణ, గొల్లవిల్లి ప్రవీణ్, పిట్ల హరీశ్, చైతన్య, సూర్యనారాయణ, సన్యాసినాయుడు, రామారావు, గంగాధర్, సాయి పాల్గొన్నారు.