స్టైఫండ్‌ సకాలంలో చెల్లించాలని కలెక్టర్‌కు వినతి

ABN , First Publish Date - 2021-03-23T04:47:00+05:30 IST

ఐదు నెలలుగా బకాయివున్న తమ స్టైఫండ్‌ తక్షణం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కేజీహెచ్‌ వైద్య విద్యార్థులు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను కోరారు.

స్టైఫండ్‌ సకాలంలో చెల్లించాలని కలెక్టర్‌కు వినతి
కలెక్టరేట్‌కు ర్యాలీగా వెళ్తున్న వైద్య విద్యార్థులు

వినతిపత్రం అందించిన కేజీహెచ్‌ జూనియర్‌ వైద్యులు

విశాఖపట్నం, మార్చి 22: ఐదు నెలలుగా బకాయివున్న తమ స్టైఫండ్‌ తక్షణం చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని కేజీహెచ్‌ వైద్య విద్యార్థులు కలెక్టర్‌ వినయ్‌చంద్‌ను కోరారు. స్టైఫండ్‌ కోసం రెండు రోజులుగా విధులు బహిష్కరించి ఆందోళన చేస్తున్న విద్యార్థులు సోమవారం కేజీహెచ్‌ నుంచి ర్యాలీగా కలెక్టరేట్‌కు వెళ్లారు. కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా జూనియర్‌ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు దీప్‌చంద్‌ మాట్లాడుతూ బకాయిలు చెల్లించేలా కృషిచేస్తూ ఇకపై ప్రతినెలా క్రమం తప్పకుండా స్టైఫండ్‌ అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

Updated Date - 2021-03-23T04:47:00+05:30 IST