వైభవంగా కనకమహాలక్ష్మి తీర్థ మహోత్సవం

ABN , First Publish Date - 2021-01-20T05:39:24+05:30 IST

ధర్మవరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది.

వైభవంగా కనకమహాలక్ష్మి తీర్థ మహోత్సవం
అమ్మవారిని దర్శించుకుంటున్న ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు

అమ్మవారిని దర్శించుకున్న ప్రముఖులు

అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు


ఎలమంచిలి, జనవరి 19: ధర్మవరంలోని కనకమహాలక్ష్మి అమ్మవారి తీర్థ మహోత్సవం మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. అమ్మవారి ఆలయంలో తెల్లవారు నుంచి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు, ప్రముఖులు వచ్చిఅమ్మవారికి మొక్కులు తీర్చుకున్నారు. ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు, డీసీసీబీ పర్సన్‌ ఇన్‌చార్జి సుకుమారవర్మ, వైసీసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి బోదెపు గోవింద్‌, పట్టణ అద్యక్షుడు బొద్దపు యర్రయ్యదొర, బెజవాడ నాగేశ్వరావు, జనసేన నేత సుందరపు విజయ్‌కుమార్‌ అమ్మవారిని దర్శించుకున్నారు.

రాజీవ్‌గాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఉత్సవ కమిటీ గౌరవ అధ్యక్షుడు కొఠారు సాంబ, కమిటీ ప్రతినిధులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఉత్సవంలో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సీఐ నారాయణరావు పోలీసు బందోబస్తు నిర్వహించారు.

Updated Date - 2021-01-20T05:39:24+05:30 IST