సైనికుల త్యాగాలకు జోహార్లు
ABN , First Publish Date - 2021-12-15T05:53:38+05:30 IST
దేశ రక్షణలో సైనికుల త్యాగాలకు జోహార్లు అర్పించడంతో పాటు వారి సేవలను గౌరవించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ పాకిస్థాన్‌తో యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులు, గాయపడిన వారి సేవలను గౌరవించడం కనీస బాధ్యతన్నారు.

కలెక్టర్ మల్లికార్జున
ఘనంగా స్వర్ణిమ విజయ్ వర్ష్
మహారాణిపేట, డిసెంబరు 14: దేశ రక్షణలో సైనికుల త్యాగాలకు జోహార్లు అర్పించడంతో పాటు వారి సేవలను గౌరవించాలని జిల్లా కలెక్టర్ ఎ.మల్లికార్జున అన్నారు. పాకిస్థాన్‌తో యుద్ధంలో విజయం సాధించి 50 సంవత్సరాలు పూర్తైన సందర్భంగా మంగళవారం కలెక్టరేట్‌లో స్వర్ణిమ్ విజయ్ వర్ష్ వేడుకలు నిర్వహించారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి వేడుకలను ప్రారంభించిన కలెక్టర్ పాకిస్థాన్‌తో యుద్ధంలో వీర మరణం పొందిన సైనికులు, గాయపడిన వారి సేవలను గౌరవించడం కనీస బాధ్యతన్నారు. 1973లో జరిగిన ఈ యుద్ధంలో మన సైనికులు వీరోచిత పోరాటంతో పాకిస్థాన్ సేనలను తుత్తునియలు చేసి ఘన విజయం అందించారని అన్నారు. అనంతరం వీర మరణం పొందిన సైనికుల బంధువులు ముగ్గురికి రూ.10 వేల చొప్పున, యుద్ధంలో పాల్గొన్న నాటి సైనికులకు మెమెంటోలను అందించారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో శ్రీనివాసమూర్తి, సైనిక సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వీవీ రాజారావు. ఎం.కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.