18న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2021-12-16T05:22:56+05:30 IST

విశాఖ నగరం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 18వ తేదీన నిరుద్యోగ యువత కోసం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు.

18న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

విశాఖపట్నం, డిసెంబరు 15 : విశాఖ నగరం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 18వ తేదీన నిరుద్యోగ యువత కోసం జాబ్‌ మేళా నిర్వహించనున్నట్టు జిల్లా ఉపాధి కల్పనాధికారి సిహెచ్‌.సుబ్బిరెడ్డి తెలిపారు. ఈ జాబ్‌ మేళాలో అలొవెరా ఏనిమల్స్‌ హెల్త్‌ లిమిటెడ్‌, హిందూస్థాన్‌ కో కోకోలా బేవరేజెస్‌, రిలయన్స్‌ నిప్పాన్‌ లైఫ్‌ ఇన్సురెన్సు తదితర కంపెనీల ప్రతినిధులు హాజరుకానున్నారని తెలిపారు. నిరుద్యోగ యువత తమ పేర్లను ముందుగా ఎన్‌సీఎస్‌.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని డీఈవో సూచించారు. ఆసక్తి, అర్హత ఔత్సాహిక యువత 18వ తేదీ ఉదయం 10 గంటలకు అన్నీ ధ్రువపత్రాలు, బయోడేటా దరఖాస్తుతో ఉపాధి కార్యాలయానికి హాజరు కావాలని సూచించారు. 

Updated Date - 2021-12-16T05:22:56+05:30 IST