10న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

ABN , First Publish Date - 2021-12-07T06:17:10+05:30 IST

విశాఖ నగరం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 10న యువతకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి (టెక్నికల్‌) కె.సుధ తెలిపారు.

10న ఉపాధి కార్యాలయంలో జాబ్‌ మేళా

విశాఖపట్నం, డిసెంబరు 6: విశాఖ నగరం కంచరపాలెంలోని జిల్లా ఉపాధి కార్యాలయంలో ఈనెల 10న యువతకు జాబ్‌ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారిణి (టెక్నికల్‌) కె.సుధ తెలిపారు. ప్లేస్‌మెంట్స్‌ స్కిల్స్‌ ఇండియా ప్రయివేటు లిమిటెడ్‌ ఆధ్వర్యంలో ఐనాక్స్‌ మూవీస్‌, యాక్సెస్‌ బ్యాంకు, పేటీఎం, టెలీసేల్స్‌, మీ షో తదితర 6 కంపెనీల ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తారన్నారు. మొత్తం  470 ఖాళీలు భర్తీ చేయనున్నారని, టెన్త్‌, ఇంటర్‌, డిగ్రీ పాసైన వారు అన్ని ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు. వివరాలకు నేషనల్‌ కెరీర్‌ సర్వీస్‌ వెబ్‌సైట్‌లో వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. 

Updated Date - 2021-12-07T06:17:10+05:30 IST