రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్న జగన్‌ పాలన

ABN , First Publish Date - 2021-01-14T05:00:57+05:30 IST

సీఎం జగన్‌ తీసుకుంటున్న వ్యతిరేక విధానాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు.

రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్న జగన్‌ పాలన
భోగి మంటలో వైసీపీ ప్రభుత్వ జీవో ప్రతులను వేస్తున్న తాతయ్యబాబు, టీడీపీ నాయకులు

చోడవరం నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు

భోగి మంటలో వైసీపీ జీవో కాపీలు దహనం


బుచ్చెయ్యపేట, జనవరి 13: సీఎం జగన్‌ తీసుకుంటున్న వ్యతిరేక విధానాలు రైతులకు కన్నీళ్లు మిగుల్చుతున్నాయని చోడవరం అసెంబ్లీ నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు అన్నారు. జగన్‌ ప్రభుత్వం ఇచ్చిన రైతు వ్యతిరేక జీవోల ప్రతులను బుధవారం భోగి మంటల్లో వేసి నిరసన తెలిపారు. వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించడం, సున్నా వడ్డీని కుదించడం, ప్రకృతి సేద్యం నిధులను వైఎస్‌ పుట్టిన రోజు వేడుకులకు ఖర్చు చేయడం, కులాల వారీగా రైతుల్లో చీలక తేవడం వంటి వ్యతిరేక విధానాలను అందరూ ఖండించాలని ఈ సందర్భంగా బత్తుల పిలుపునిచ్చారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు దొండా శ్రీను, సాయిం శేషు, ఎస్‌.శ్రీరామూర్తి, దొండా వెంకటరమణ పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:00:57+05:30 IST