ఓటీఎస్‌ పేరుతో పేదలను దోచుకోవడం తగదు

ABN , First Publish Date - 2021-11-23T06:18:40+05:30 IST

ఓటీఎస్‌ పేరుతో పేద ప్రజలను దోచుకోవడం వైసీపీ ప్రభుత్వానికి తగదని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దొండా నరేశ్‌ తదితరులు విమర్శించారు.

ఓటీఎస్‌ పేరుతో పేదలను దోచుకోవడం తగదు
మాట్లాడుతున్న టీడీపీ నాయకులు

తెలుగుదేశం పార్టీ నాయకులు


బుచ్చెయ్యపేట, నవంబరు 22: ఓటీఎస్‌ పేరుతో పేద ప్రజలను దోచుకోవడం వైసీపీ ప్రభుత్వానికి తగదని టీడీపీ పార్లమెంట్‌ నియోజకవర్గ తెలుగుయువత ఉపాధ్యక్షుడు శిరిగిరిశెట్టి శ్రీరామూర్తి, టీడీపీ పట్టణ అధ్యక్షుడు దొండా నరేశ్‌ తదితరులు విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వస్తే హౌసింగ్‌ రుణాలు మాఫీ చేస్తామని చోడవరం నియోజకవర్గం ఇన్‌చార్జి బత్తుల తాతయ్యబాబు, మాజీ ఎమ్మెల్యే కెఎస్‌ఎన్‌ఎస్‌.రాజు ఇచ్చిన హామీని గ్రామ వైసీపీ అధ్యక్షుడు దొండా నారాయణమూర్తి తప్పుపట్టడాన్ని వారు ఖండించారు. టీడీపీకి పేదల పట్ల ఉన్న సానుభూతి మేరకు హౌసింగ్‌ రుణాలను మాఫీ చేస్తామని హామీ ఇచ్చినట్టు చెప్పారు. వైసీపీ ప్రభుత్వానికి దమ్ముంటే హౌసింగ్‌ రుణాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించి పేదల పట్ల తమ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని సవాల్‌ విసిరారు. సమావేశంలో నాయకులు బత్తుల కన్నబాబు, ఎ.కనకారావు పాల్గొన్నారు. 


Updated Date - 2021-11-23T06:18:40+05:30 IST