ఎమ్మెల్యేను దూషించడం తగదు

ABN , First Publish Date - 2021-12-30T06:09:01+05:30 IST

ఎమ్మెల్యే బాబూరావు ద్వారా పదవులు, ఎంతో గౌరవం పొందిన ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, గోవింద్‌ దంపతులు ఇప్పుడు ఆయనను విమర్శించడం, దూషించడం తగదని పలువురు వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యేను దూషించడం తగదు
విలేఖర్ల సమావేశంలో ఎమ్మెల్యే వర్గీయులు

 బాబూరావు వర్గీయుల ఆవేదన

ఎస్‌.రాయవరం, డిసెంబరు 29 : ఎమ్మెల్యే బాబూరావు ద్వారా పదవులు, ఎంతో గౌరవం పొందిన ఎంపీపీ బొలిశెట్టి శారదాకుమారి, గోవింద్‌ దంపతులు ఇప్పుడు ఆయనను విమర్శించడం, దూషించడం తగదని పలువురు వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు.  కొరుప్రోలులో గల క్యాంపు కార్యాలయంలో బుధవారం పాయకరావుపేట జడ్పీటీసీ సభ్యుడు లంకా సూరిబాబు, నాయకులు ధనిశెట్టి బాబూరావు, జగతా శ్రీను,  వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి దత్తుడు సీతబాబు, ఎస్‌.రాయవరం మండలం నాయకులు చేకూరి శ్రీరామచంద్రరాజు, మాతా గుర్నాథరావు, మధువర్మ, నక్కపల్లి మండలం ఎంపీటీసీ కో-ఆప్షన్‌ సభ్యుడు లొడగల చంద్రరావు, కొరుప్రోలు ఎంపీటీసీ కె.వెంకటలక్ష్మి  విలేఖర్లతో మాట్లాడారు. నియోజకవర్గంలో ఎవరికీ ఇవ్వ లేనంత గౌరవం ఎమ్మెల్యే బొలిశెట్టి గోవింద్‌కు ఇచ్చారన్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసం విమర్శలు చేయడం మంచిది కాదన్నారు. నాయకులు శీరం నర్సింహమూర్తి, యలమంచిలి తాతబాబు, గొర్ల బాబూరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-30T06:09:01+05:30 IST