కాపునాడు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా ఈశ్వరరావు ఎన్నిక
ABN , First Publish Date - 2021-10-21T06:05:37+05:30 IST
ఆంధ్రప్రదేశ్ కాపునాడు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా గంటా ఈశ్వరరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ 87వ వార్డు కూర్మన్నపాలెంలోని ప్రైవేట్ హోటల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్ కాపునాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది.

కూర్మన్నపాలెం, అక్టోబరు 20: ఆంధ్రప్రదేశ్ కాపునాడు జిల్లా కమిటీ అధ్యక్షుడిగా గంటా ఈశ్వరరావు ఎన్నికయ్యారు. జీవీఎంసీ 87వ వార్డు కూర్మన్నపాలెంలోని ప్రైవేట్ హోటల్‌లో బుధవారం ఆంధ్రప్రదేశ్ కాపునాడు జిల్లా కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు పురంశెట్టి రంగారావు హాజరయ్యారు. ఈ సమావేశంలో కాపునాడు విశాఖ అర్బన్ మహిళా అధ్యక్షురాలిగా మల్ల రమణి, రాష్ట్ర అధికార ప్రతినిధిగా ఈటి రంగారావులను ఎన్నుకున్నారు. ఈ సమావేశంలో కాశిబాబు, కొండలరావు, దుర్గారావు, నరసింహమూర్తి, రమ, సూర్య, సాయిరామ్, దుర్గ, రాధమ్మ, హరీష్, నాయుడు తదితరులు పాల్గొన్నారు.