మరుగుదొడ్ల నిర్వహణ ఇలాగేనా..?

ABN , First Publish Date - 2021-11-02T05:50:40+05:30 IST

మరుగుదొడ్ల నిర్వహణపై మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.రామరాజు మండిపడ్డారు.

మరుగుదొడ్ల నిర్వహణ ఇలాగేనా..?
పాఠశాలలో మరుగుదొడ్లను పరిశీలిస్తున్న ఎండీఎం ఏడీ రామరాజు

కన్నూరుపాలెం హెచ్‌ఎం తీరుపై ఎండీఎం ఏడీ ఆగ్రహం


కశింకోట, నవంబరు 1: మరుగుదొడ్ల నిర్వహణపై మధ్యాహ్న భోజన పథకం అసిస్టెంట్‌ డైరెక్టర్‌ డి.రామరాజు మండిపడ్డారు. కన్నూరుపాలెం జడ్పీ ఉన్నత పాఠశాలను సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని మరుగుదొడ్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. మరుగుదొడ్ల నుంచి దుర్వాసన వెదజల్లడం, పరిశుభ్రత పాటించకపోవడం గుర్తించి హెచ్‌ఎం రాంప్రసాద్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. నాడు-నేడులో ప్రభుత్వం లక్షలాది రూపాయలు వెచ్చించి పాఠశాలలను సుందరంగా తీర్చిదిద్దుతుంటే కనీసం మరుగుదొడ్లను సక్రమంగా నిర్వహించకపోతే ఎలాగని  ప్రశ్నించారు. పది రోజుల్లో మార్పు రాకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం ప్రాథమిక పాఠశాలను సందర్శించి మధ్యాహ్న భోజనం రుచి చూశారు. భోజనం మరింత రుచికరంగా తయారుచేయాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో డి.దివాకర్‌ ఉన్నారు.

Updated Date - 2021-11-02T05:50:40+05:30 IST