ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానం
ABN , First Publish Date - 2021-07-08T06:00:50+05:30 IST
జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో 2021 ఆగస్టు నుంచి ప్రారంభంకానున్న విద్యా సంవత్సరం ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌నకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో గురువారం నుంచి స్వీకరించనున్నట్టు కంచరపాలెం ఐటీఐ ప్రిన్సిపాల్ వై.ఉమాశంకర్ తెలిపారు.

నేటి నుంచి ఆన్‌లైన్‌లో సమర్పణకు అవకాశం
ఈ నెల 25వ తేదీ వరకు గడువు
కంచరపాలెం, జూలై 7: జిల్లాలోని ప్రభుత్వ, ప్రయివేటు ఐటీఐల్లో 2021 ఆగస్టు నుంచి ప్రారంభంకానున్న విద్యా సంవత్సరం ప్రవేశాలకు మొదటి విడత కౌన్సెలింగ్‌నకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆన్‌లైన్ విధానంలో గురువారం నుంచి స్వీకరించనున్నట్టు కంచరపాలెం ఐటీఐ ప్రిన్సిపాల్ వై.ఉమాశంకర్ తెలిపారు. మొదటి విడత కౌన్సెలింగ్‌నకు అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుందన్నారు. దరఖాస్తులను ఈనెల 25వ తేదీ సాయంత్రం 5గంటలలోగా సబ్‌మిట్ చేయాలని సూచించారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులు పరిశీలించమన్నారు.
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు కౌన్సెలింగ్ తేదీ, సమయం తదితర వివరాలను వారి రిజిస్టర్ మొబైల్ నంబర్‌కు పంపుతామని, పత్రికలకు తెలియజేస్తామన్నారు. అభ్యర్థులు ఐటీఐ.నిక్.ఇన్ (జ్టీజీ.ుఽజీఛి.జీుఽ) వెబ్ సైట్‌లో లాగిన్ అయి దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. అభ్యర్థులు ఒకటి కంటే ఎక్కువ ఐటీఐల్లో ప్రవేశానికి ఆప్షన్‌లు ఇచ్చుకోవచ్చని, ఒకవేళ సబ్‌మిట్ చేసిన దరఖాస్తుల్లో తప్పులు ఉంటే మళ్లీ లాగిన్ అయి రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టిన తేదీ, హాల్‌టికెట్ నంబరు వివరాలతో ఎడిట్ ఆప్షన్ ద్వారా సరిచేసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు.