రహదారి విస్తరణ పనుల అడ్డగింత

ABN , First Publish Date - 2021-02-05T06:41:16+05:30 IST

గొరపల్లి వద్ద అనకాపల్లి- ఆనందపురం ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులను గొరపల్లి, గవరపాలెం వాసులు గురువారం అడ్డుకున్నారు.

రహదారి విస్తరణ పనుల అడ్డగింత
విస్తరణ పనులను అడ్డుకున్న దృశ్యం

పెందుర్తి, ఫిబ్రవరి 4: గొరపల్లి వద్ద అనకాపల్లి- ఆనందపురం ఆరు లైన్ల రోడ్డు విస్తరణ పనులను గొరపల్లి, గవరపాలెం వాసులు గురువారం అడ్డుకున్నారు. గొరపల్లి వద్ద అండర్‌ పాస్‌వే నిర్మించకుండా విస్తరణ పనులు చేపడితే సహించబోమంటూ ఎక్సకవేటర్‌ ముందు బైఠాయించారు. ఈ సందర్భంగా టీడీపీ  మండల అధ్యక్షుడు కరక దేవుడు మాట్లాడుతూ గొరపల్లి వద్ద అండర్‌ పాస్‌వే నిర్మించాలని ప్రజాప్రయోజన వ్యాజ్యం కింద హైకోర్టులో పిల్‌ వేశామన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుదు కంచిపాటి వెంకట సన్యాసిరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-02-05T06:41:16+05:30 IST