స్టీల్‌ప్లాంట్‌కు అంతర్జాతీయ క్యూసీ అవార్డులు
ABN , First Publish Date - 2021-11-26T05:45:52+05:30 IST
విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అంతర్జాతీయ క్వాలిటీ సర్కిల్ (క్యూసీ) అవార్డులు లభించాయి. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్ (ఐసీక్యూసీసీ) 2021 సదస్సులో స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ విభాగం ప్రేరణ జట్టుకు పార్ ఎక్స్‌లెన్స్ అవార్డు, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగం నియంత్రణ జట్టు, ఎల్‌అండ్‌డీసీ విభాగం ప్రగతి జట్టుకు ఎక్స్‌లెన్స్ అవార్డులు లభించాయి.

ఉక్కుటౌన్‌షిప్, నవంబరు 25: విశాఖ స్టీల్‌ప్లాంట్‌కు అంతర్జాతీయ క్వాలిటీ సర్కిల్ (క్యూసీ) అవార్డులు లభించాయి. క్వాలిటీ సర్కిల్ ఫోరం ఆఫ్ ఇండియా (క్యూసీఎఫ్‌ఐ) ఆధ్వర్యంలో ఈనెల 24, 25 తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహించిన ఇంటర్నేషనల్ కన్వెన్షన్ ఆఫ్ క్వాలిటీ సర్కిల్ (ఐసీక్యూసీసీ) 2021 సదస్సులో స్టీల్‌ప్లాంట్ ఎస్‌ఎంఎస్ విభాగం ప్రేరణ జట్టుకు పార్ ఎక్స్‌లెన్స్ అవార్డు, రోల్ షాప్ అండ్ రిపేర్ షాప్ విభాగం నియంత్రణ జట్టు, ఎల్‌అండ్‌డీసీ విభాగం ప్రగతి జట్టుకు ఎక్స్‌లెన్స్ అవార్డులు లభించాయి. అదే విధంగా స్టీల్‌ప్లాంట్‌కు అందజేసిన లాంగ్ పార్టిసిపేషన్ అవార్డును హెచ్‌ఆర్ సీజీఎం కె.శ్రీనివాసరావు అందుకున్నారు. అవార్డులు లభించడం పట్ల స్టీల్‌ప్లాంట్ సీఎండీ అతుల్‌భట్, డైరెక్టర్లు హర్షం వ్యక్తం చేశారు.