అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంప్ విశాఖ
ABN , First Publish Date - 2021-11-21T06:28:35+05:30 IST
అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌ను విశాఖపట్నం జట్టు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ స్టేడియంలో నిర్వహించిన 33వ అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ పోటీలు శనివారంతో ముగిశాయి

ఉక్కుటౌన్‌షిప్(విశాఖపట్నం), నవంబరు 20: అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ చాంపియన్‌షిప్‌ను విశాఖపట్నం జట్టు గెలుచుకుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టీల్‌ప్లాంట్ స్టేడియంలో నిర్వహించిన 33వ అంతర్ జిల్లా రోలర్ స్కేటింగ్ పోటీలు శనివారంతో ముగిశాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిఽఽథిగా స్టీల్‌ప్లాంట్ జీఎం ఎఫ్‌కే లక్రా విచ్చేసి, విజేత జట్లకు ట్రోఫీలు బహూకరించారు.
రోలర్ హాకీ విభాగంలో..
రోలర్ హాకీ సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో విశాఖ, కృష్ణా జిల్లా జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందాయి. సబ్ జూనియర్స్ బాలికల విభాగంలో విశాఖపట్నం, గుంటూరు, కృష్ణా జిల్లా జట్లు వరుసగా ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచాయి.
ఇన్‌లైన్ హాకీ విభాగంలో....
ఇన్‌లైన్ హాకీ సబ్ జూనియర్స్ బాలుర విభాగంలో విశాఖ, కృష్ణా జిల్లాల జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందాయి. జూనియర్స్ బాలుర విభాగంలో కృష్ణా, విశాఖపట్నం జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు సాధించాయి. సీనియర్స్ మెన్ విభాగంలో విశాఖపట్నం, కృష్ణా జిల్లాల జట్లు ప్రథమ, ద్వితీయ స్థానాలు పొందాయి.