కౌటింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి

ABN , First Publish Date - 2021-03-14T06:15:22+05:30 IST

కౌటింగ్‌ కేంద్రంలో జనరేటర్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లిఖిత పూర్వంగా సబ్‌ కలెక్టర్‌ మౌర్యను కోరారు.

కౌటింగ్‌ కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయండి
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు


  సబ్‌ కలెక్టర్‌కు మాజీ మంత్రి అయ్యన్న వినతి

నర్సీపట్నం : కౌటింగ్‌ కేంద్రంలో జనరేటర్‌, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు లిఖిత పూర్వంగా సబ్‌ కలెక్టర్‌ మౌర్యను కోరారు. శనివారం సబ్‌ కలెక్టర్‌ కార్యాలయానికి వెళ్లి వినతి పత్రం అందజేశారు. విద్యుత్‌ అంతరాయం ఏర్పడితే ఇబ్బంది లేకుండా ఉండేందుకు జనరేటర్లు సిద్ధం చేయాలన్నారు. మూడు కౌటింగ్‌ హాళ్లలో సీసీ కెమెరాలు, వీడియో రికార్డింగ్‌ ఏర్పాటు చేయాలని కోరారు.


Updated Date - 2021-03-14T06:15:22+05:30 IST