ఏయూ గెస్ట్‌ ఫ్యాకల్టీ ఫిర్యాదుపై విచారణ జరపండి

ABN , First Publish Date - 2021-07-09T05:28:29+05:30 IST

ఆంధ్ర విశ్వవిద్యాలయం గెస్ట్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ మూకుడుపల్లి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టవలసిందిగా నగర పోలీస్‌ కమిషనర్‌కు పంపిన లేఖలో జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ పేర్కొన్నారు.

ఏయూ గెస్ట్‌ ఫ్యాకల్టీ ఫిర్యాదుపై విచారణ జరపండి

సీపీకి లేఖ పంపిన కలెక్టర్‌ వినయ్‌చంద్‌

ఏయూ క్యాంపస్‌, జూలై 8: ఆంధ్ర విశ్వవిద్యాలయం గెస్ట్‌ ఫ్యాకల్టీ డాక్టర్‌ మూకుడుపల్లి రాజేశ్వరరావు ఇచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపి తగిన చర్యలు చేపట్టవలసిందిగా నగర పోలీస్‌ కమిషనర్‌కు పంపిన లేఖలో జిల్లా కలెక్టర్‌ వి.వినయ్‌చంద్‌ పేర్కొన్నారు. ఏయూ సంస్కృతి విభాగంలో ఉన్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ చిత్రపటాన్ని తొలగించాలంటూ ప్రొఫెసర్‌ ఓరుగంటి రామ్‌లాల్‌ శర్మ, ఫ్యాకల్టీ డాక్టర్‌ చోడిశెట్టి రామ్‌గోపాల్‌లు తనను వేధిస్తున్నారంటూ కలెక్టర్‌కు రాజేశ్వరరావు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ నిర్వహించి చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. 

Updated Date - 2021-07-09T05:28:29+05:30 IST