గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలి
ABN , First Publish Date - 2021-10-21T06:19:00+05:30 IST
గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆదేశించారు.

అరకులోయ ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ
అరకులోయ, అక్టోబరు 20: గ్రామాల్లో పారిశుధ్యాన్ని మెరుగుపరచాలని ఎమ్మెల్యే చెట్టి ఫాల్గుణ ఆదేశించారు. బుధవారం ఇక్కడ నిర్వహించిన ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన పెదలబుడు మేజర్ పంచాయతీకి ప్రభుత్వం మంజూరు చేసిన ఈ-ఆటోని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛ ఆంధ్రకార్పొరేషన్ డైరెక్టర్ శోభ సోమేశ్వరి, పెదలబుడు సర్పంచ్ దాసుబాబు, ఎంపీడీఓ రాంబాబు, తహసీల్దార్ వేణుగోపాల్, ఈవోపీఆర్డీ శేఖర్‌బాబు ఏఎంసీ చైర్పర్సన్ అనిత, జడ్పీటీసీ సభ్యురాలు రోష్ని, ఎంపీపీ ఉషారాణి, తదితరులు పాల్గొన్నారు.
‘స్వచ్ఛ సంకల్పం’తో ఆరోగ్యకర వాతావరణం
పాడేరురూరల్, అక్టోబరు 20: ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంతో గ్రామాల్లో ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని ఎంపీపీ సొనారి రత్నకుమారి అన్నారు. ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం ఆమె మాట్లాడుతూ, ప్రజలు ఇళ్లల్లో తడి, పొడిచెత్తను వేర్వేరు చేసి, వీధిలోకి వచ్చే పారిశుధ్య కార్మికులకు అందజేయాలని సూచించారు. అనంతరం ‘స్వచ్ఛ సంకల్పం’ వాహనాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో కేవీ.నరసింహారావు, ఈవోపీఆర్డీ పి.విజయలక్ష్మి, ఎంపీటీసీ సభ్యులు, సర్పంచ్‌లు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, గ్రామ వలంటీర్లు పాల్గొన్నారు.
చింతపల్లిలో...
చింతపల్లి: ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమం క్షేతస్థాయిలో సమర్థంగా అమలుకావాలని, ఇందుకోసం ఇంటింటా ప్రచారం చేసి ప్రజలకు అవగాహన కల్పించాలని ఎంపీపీ వంతల బాబూరావు అన్నారు. తాగునీరు, పారిశుధ్య సమస్యల పరిష్కారానికి టాస్క్ఫోర్సు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఎంపీడీవో లాలం సీతయ్య, జడ్పీటీసీ సభ్యుడు పోతురాజు బాలయ్య, స్థానిక సర్పంచ్ దురియా పుష్పలత, ఈవోపీఆర్డీ శ్రీనివాసరావు, ఆర్డబ్ల్యూఎస్ ఏఈఈ స్వర్ణలత పాల్గొన్నారు.
కొయ్యూరులో...
కొయ్యూరు: ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమంలో ప్రజలను భాగస్వాములను చేయాలని ఎంపీపీ రమేశ్‌బాబు సూచించారు. వంద రోజులపాటు నిర్వహించే ఈ కార్యక్రమం విజయవంతం చేసేందుకు అందరూ కృషి చేయాలన్నారు. వైస్ ఎంపీపీ అప్పన వెంకటరమణ, జడ్పీటీసీ సభ్యుడు వారా నూకరాజు, సర్పంచ్‌లు, ఈవోపీఆర్డీ బాలుదొర పాల్గొన్నారు.
ముంచంగిపుట్టులో...
ముంచంగిపుట్టు: ‘స్వచ్ఛ సంకల్పం’పై సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులకు స్థానిక వెలుగు కార్యాలయంలో శిక్షణ నిర్వహించారు. పరిసరాలు పరిశుభ్రంగా వుండాలని, వీధుల్లో మురుగునీరు నిల్వవుండకుండా చూడాలని అధికారులు కోరారు. అనంతరం అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ఎ.సీతమ్మ, ఏవో ప్రభాకరం, ఈవోపీఆర్డీ చిన్న, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడలో...
డుంబ్రిగుడ: ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఎంపీడీఓ భాగ్యారావు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా అవగాహన ర్యాలీ, మానవహారం నిర్వహించారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, అధికారులు, పంచాయతీ కార్యదర్శులు, వైసీపీ నాయకులు పాల్గొన్నారు.
అనంతగిరిలో...
అనంతగిరి: మండలంలో ‘స్వచ్ఛ సంకల్పం’ కార్యక్రమాన్ని ప్రణాళికాబద్ధంగా నిర్వహిస్తామని ఎంపీపీ శెట్టి నీలవేణి అన్నారు. స్వచ్ఛ సంకల్పం కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆమె మాట్లాడారు. జడ్పీటీసీ సభ్యుడు గంగరాజు, ఈఓపీఆర్డీ మల్లేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.