యండపల్లివలస గురుకులంలో అమలుకాని మెనూ

ABN , First Publish Date - 2021-11-02T06:25:59+05:30 IST

రిజన గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు.

యండపల్లివలస గురుకులంలో అమలుకాని మెనూ
విద్యార్థులకు ఉడకబెట్టిన కుళ్లిన కోడిగుడ్లు


విద్యార్థినులకు కుళ్లిన గుడ్లు సరఫరా

డస్ట్‌బిన్లలో వేసిన చిన్నారులు... చాలీచాలని కూరలు

డ్రైనింగ్‌ హాలు, మినరల్‌ వాటర్‌ ప్లాంట్‌లను 

వినియోగించని పాఠశాల ఉపాధ్యాయులు

అరకురూరల్‌, నవంబరు 1: గిరిజన గురుకులాల్లో విద్యార్థులకు మెనూ ప్రకారం భోజనం అందడంలేదు. పద్మాపురం పంచాయతీ యండపల్లివలస బాలికల గురుకుల పాఠశాలలో సోమవారం కుళ్లిన కోడిగుడ్లతో విద్యార్థులకు భోజనం పెట్టారు. దీంతో వారు ఆ గుడ్లు తినకుండా చెత్తబట్టలో వేశారు. అలాగే విద్యార్థినులకు ప్రతీరోజూ మధ్యాహ్నం ఒంటి గంటలకు భోజనం పెట్టాల్సి ఉండగా సోమవారం యండపల్లివలస బాలికల గురుకులంలో 2.15 గంటలకు  పెట్టారు. భోజనంలో కూరలు చాలీచాలని విధంగా వేశారు. కుళ్లిన కోడిగుడ్లు ఇవ్వడంతో విద్యార్థులు వాటిని చెత్తబుట్టలో వేశారు. వీరికి నాడు- నేడులో డ్రైనింగ్‌ హాలు నిర్మించినా ఇంతవరకు అందుబాటులోకి తీసుకు రాలేదని విద్యార్థినులు తెలిపారు. అలాగే మినరల్‌ వాటర్‌ సదుపాయం ఉన్నా పైపుల నీటినే తాగుతున్నామని విద్యార్థినులు తెలిపారు. మెనూ సక్రమంగా అమలుకాని విషయాన్ని కొంతమంది పాడేరు గిరిజన సంక్షేమ శాఖ డీడీ విజయకుమార్‌కు, పీవో గోపాలక్రిష్ణ, గిరిజన సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీకాంత్‌ ప్రభాకర్‌కు పలువురు ఫోన్లో ఫిర్యాదు చేశారు. దీనిపై వారు స్పందిస్తూ గురుకులాల్లో ఉన్న సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.  

 


Updated Date - 2021-11-02T06:25:59+05:30 IST