హైవే నిర్మాణంతో నష్టపోయే బాధితులను గుర్తించాలి: ఆర్డీవో

ABN , First Publish Date - 2021-03-24T06:09:06+05:30 IST

జాతీయ రహదారి నిర్మాణం కారణంగా భూములు, ఇతర ఆస్తులను నష్టపోయే బాధితులను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు పాడేరు ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి సూచించారు.

హైవే నిర్మాణంతో నష్టపోయే బాధితులను గుర్తించాలి: ఆర్డీవో
భూముల రికార్డులను పరిశీలిస్తున్న ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతిహుకుంపేట, మార్చి 23: జాతీయ రహదారి నిర్మాణం కారణంగా భూములు, ఇతర ఆస్తులను నష్టపోయే బాధితులను గుర్తించాలని రెవెన్యూ అధికారులకు పాడేరు ఆర్డీవో కేఎల్‌.శివజ్యోతి సూచించారు. మంగళవారం ఆమె స్థానిక తహసీల్దార్‌ కార్యాలయంలో భూముల రికార్డులను పరిశీలించి, హైవే నిర్మాణంతో ఎవరెవరి భూములకు నష్టం వాటిల్లుతుందనే అంశాలపై రెవెన్యూ అధికారులతో చర్చించారు. రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించి, బాధితులను పక్కాగా గుర్తించాలన్నారు. ఈ ప్రక్రియను వేగంగా నిర్వహించాలన్నారు. అలాగే మండలంలోని రంగశీల, బోడిగపుట్టు, పెదగరువు, కోట్నాపల్లి ప్రాంతాల రైతులతో ఆర్డీవో మాట్లాడారు. హైవే నిర్మాణంతో పాటిమామిడి గ్రామం నుంచి రంగశీల గ్రామం వరకు భూములను కోల్పోతున్న రైతుల వివరాలను సక్రమంగా సేకరించాలన్నారు. ఈకార్యక్రమంలో తహసీల్దార్‌ కోటేశ్వరరావు, ఆర్‌ఐలు నల్లన్న, మత్స్యరాజు, సిబ్బంది పాల్గొన్నారు.


Updated Date - 2021-03-24T06:09:06+05:30 IST