మానవ అక్రమ రవాణాను నివారించాలి
ABN , First Publish Date - 2021-11-28T06:04:25+05:30 IST
మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా వుందని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు.

ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి
ఏయూ క్యాంపస్, నవంబరు 27: మానవ అక్రమ రవాణాను పూర్తిస్థాయిలో నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా వుందని ఏయూ వీసీ పీవీజీడీ ప్రసాదరెడ్డి అన్నారు. మానవ అక్రమ రవాణా నియంత్రణపై అవగాహన కల్పిస్తూ విశాఖ నుంచి భువనేశ్వర్, తిరిగి భువనేశ్వర్ నుంచి విశాఖ వరకు నిర్వహిస్తున్న సైకిల్ ర్యాలీని శనివారం ఏయూ పరిపాలనా భవనం వద్ద ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ మాట్లాడుతూ రైడ్ ఫర్ చేంజ్ ప్రొగ్రామ్‌లో భాగంగా 14 రోజుల్లో 1,400 కిమీటర్ల దూరాన్ని యువత సైకిల్‌పై ప్రయాణిస్తూ మానవ అక్రమ రవాణా నియంత్రణపై అవగాహన కల్పిస్తుందన్నారు. తొలుత దుర్గాబాయి దేశముఖ్ మహిళా అధ్యయన కేంద్రంలో ఏయూ యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ క్లబ్ వలంటీర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు. రిజిస్ట్రార్ కృష్ణమోహన్, డాక్టర్ ఉష, తదితరులు పాల్గొన్నారు.