హోరాహోరీగా జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు

ABN , First Publish Date - 2021-10-25T06:04:44+05:30 IST

జిల్లా పురుషుల, మహిళల కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు గాజువాక హైస్కూల్‌ మైదానంలో ఆదివారం హోరోహోరీగా జరిగాయి. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ క్లబ్‌లకు చెందిన 126 మంది పురుషులు, 65 మంది క్రీడాకారిణులు తలపడ్డారు.

హోరాహోరీగా జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు
జిల్లా కబడ్డీ జట్టు ఎంపిక పోటీలలో తలపడుతున్న క్రీడాకారిణులు

అక్కిరెడ్డిపాలెం, అక్టోబరు 24:  జిల్లా పురుషుల, మహిళల కబడ్డీ జట్టు ఎంపిక పోటీలు గాజువాక హైస్కూల్‌ మైదానంలో ఆదివారం హోరోహోరీగా జరిగాయి. ఈ పోటీలలో జిల్లాలోని వివిధ క్లబ్‌లకు చెందిన 126 మంది పురుషులు, 65 మంది క్రీడాకారిణులు తలపడ్డారు. రాష్ట్ర కబడ్డీ అసోసియేషన్‌ కార్యనిర్వాహక కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ పోటీలలో  పురుషుల విభాగంలో  16 మందిని, మహిళల విభాగంలో 16 మందిని ఎంపిక చేశారు. వీరు వచ్చే నెల ఆరు నుంచి  జిల్లాలోని అచ్యుతాపురం మండలం తిమ్మరాజుపేటలో  జరిగే అంతర్‌ జిల్లాల పురుషుల, మహిళల కబడ్డీ పోటీలలో పాల్గొంటారు. వీరికి సోమవారం నుంచి 12 రోజుల పాటు శిక్షణ ఇచ్చి అనంతరం రాష్ట్ర పోటీలలో పాల్గొనే జిల్లా తుది జట్టును ఎంపిక చేస్తారు.  ఈ ఎంపిక పోటీలను జాతీయ కోచ్‌ ఉమాశంకర్‌, అసోసియేషన్‌ సభ్యులు పి.అప్పారావు, బాలాజీ సింగ్‌, ఎం.గణపతి, పల్లా రమణ, ఎన్‌.అప్పారావు, పి.సత్యనారాయణ తదితరులు పర్యవేక్షించారు.


Updated Date - 2021-10-25T06:04:44+05:30 IST