యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి

ABN , First Publish Date - 2021-10-28T06:10:14+05:30 IST

మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాఖ వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.విజయనిర్మల సూచించారు.

యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడి
జుత్తాడ గ్రామంలో వరి పైరును పరిశీలిస్తున్న డీడీ

వ్యవసాయ శాఖ వనరుల కేంద్రం డీడీ విజయనిర్మల


చోడవరం, అక్టోబరు 27: మేలైన యాజమాన్య పద్ధతులతో అధిక దిగుబడులు సాధించవచ్చునని వ్యవసాయ శాఖ వనరుల కేంద్రం డిప్యూటీ డైరెక్టర్‌ ఎన్‌.విజయనిర్మల సూచించారు. బుధవారం అనకాపల్లి వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలతో కలిసి మండలంలోని జుత్తాడ, గజపతినగరం గ్రామాల్లో పర్యటించారు. వరి పంటలు, చెరకు తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. చెరకులో కలియ మచ్చలు, తుప్పు తెగులు ఎక్కువగా ఉన్నాయన్నారు. వీటి నివారణకు మాంకోజెబ్‌ మూడు గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని సూచించారు. అలాగే వరిలో వచ్చే తెగుళ్ల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్తలు చిత్రకళ, ఆదిలక్ష్మి, ఏవో నరసింహనాయక్‌ తదితరులు పాల్గొన్నారు. 


Updated Date - 2021-10-28T06:10:14+05:30 IST