అభిమానులతో హీరో కార్తికేయ చిట్‌చాట్‌

ABN , First Publish Date - 2021-11-10T05:21:37+05:30 IST

నిజ జీవితంలో ఎలా ఉంటానో రాజా విక్రమార్కలో తాను నటించిన క్యారెక్టర్‌ అలానే ఉంటుందని సినీ కథానాయకుడు కార్తికేయ అన్నారు. సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం హోటల్‌ దసపల్లాలో కళాశాలల విద్యార్థులు, అభిమానులతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు.

అభిమానులతో హీరో కార్తికేయ చిట్‌చాట్‌
చిట్‌చాట్‌లో మాట్లాడుతున్న హీరో కార్తికేయ

రాజా విక్రమార్క చిత్రం ప్రమోషన్‌ భాగంగా కార్యక్రమం

మహారాణిపేట, నవంబరు 9: నిజ జీవితంలో ఎలా ఉంటానో రాజా విక్రమార్కలో తాను నటించిన క్యారెక్టర్‌ అలానే ఉంటుందని సినీ కథానాయకుడు కార్తికేయ అన్నారు.  సినిమా ప్రమోషన్‌లో భాగంగా మంగళవారం హోటల్‌ దసపల్లాలో కళాశాలల విద్యార్థులు, అభిమానులతో ఆయన చిట్‌చాట్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా యువత సంధించిన పలు ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానాలిచ్చారు. తన అభిమాన హీరో చిరంజీవి చిత్రం టైటిల్‌ తన సినిమాకు పెట్టుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఇందులో ఎన్‌ఐఏ అధికారి పాత్ర పోషించానని, పూర్తి కమర్షియల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ యాక్షన్‌ చిత్రంగా తెరకెక్కించామన్నారు.  తన కేరీర్‌లో ఈ సినిమా మైలురాయిగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. విశాఖపట్నం నుంచి ప్రారంభించిన ప్రమోషన్‌ కార్యక్రమం కాకినాడ, రాజమండ్రి విజయవాడ మీదుగా తిరుపతి వరకు సాగుతుందని వివరించారు. ఈ కార్యక్రమంలో కార్తికేయ అభిమానులు సందడిచేశారు.  


Updated Date - 2021-11-10T05:21:37+05:30 IST