ఆపదలో పెద్ద మనసు
ABN , First Publish Date - 2021-05-09T04:27:27+05:30 IST
ఆపదలో పెద్ద మనసు

క్వారంటైన్ కేంద్రానికి రూ.25 వేలు విరాళం
మురళీనగర్ వనితా వాకర్స్ క్లబ్ వితరణ
మాధవధార, మే 8: మహా విశాఖ నగరపాలక సంస్థ 50వ వార్డు మురళీనగర్ వనితా వాకర్స్ క్లబ్ సభ్యులు గుడిలోవలోని వంద పడకల క్వారంటైన్ శిబిరానికి శనివారం రూ.25 వేలు విరాళంగా అందించారు. మాతృదినోత్సవం సందర్భంగా కొవిడ్ వైద్య సేవలకు తమవంతు సహకారంగా ఈ విరాళాన్ని ఆర్‌ఎస్‌ఎస్ సభ్యుల ద్వారా అందజేశామని వనితా వాకర్స్ ఇంటర్నేషనల్ సభ్యురాలు లక్ష్మి, సభ్యులు తెలిపారు.