కరోనా బాధితులకు ఇళ్ల వద్దే వైద్యం
ABN , First Publish Date - 2021-05-14T05:00:41+05:30 IST
మండలంలోని సబ్బవరం, గుల్లేపల్లి పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటివరకు 438 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ వైద్యడు డాక్టర్ కిశోర్‌కుమార్ తెలిపారు. వీరిలో 13 మంది విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 425 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు.

సబ్బవరం, మే 13: మండలంలోని సబ్బవరం, గుల్లేపల్లి పీహెచ్‌సీల పరిధిలో ఇప్పటివరకు 438 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని పీహెచ్‌సీ వైద్యడు డాక్టర్ కిశోర్‌కుమార్ తెలిపారు. వీరిలో 13 మంది విశాఖలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా, 425 మందిని హోమ్ ఐసోలేషన్‌లో ఉంచి చికిత్స అందిస్తున్నామన్నారు. వీరికి ప్రభుత్వం పంపిణీ చేసిన మందుల కిట్లను అందించామన్నారు. ప్రతి రెండు రోజులకు పల్స్ ఆక్సీమీటర్‌తో ఆక్సిజన్ లెవెల్స్ పరిశీలిస్తున్నామని, ప్రతిరోజూ సచివాలయ వైద్య సహాయకులు వీరికి ఫోన్ చేసి మందులు వేసుకునే విధానం, ఆరోగ్య పరిస్థితిని అంచనా వేస్తున్నారన్నారు.