అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలి

ABN , First Publish Date - 2021-11-26T05:54:40+05:30 IST

పోలీసులను ఇష్టానుసారంగా దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్‌ చేశారు.

అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలి
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న స్వర్ణలత

పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత

మద్దిలపాలెం, నవంబరు 25: పోలీసులను ఇష్టానుసారంగా దూషించిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు బహిరంగ క్షమాపణలు చెప్పాలని పోలీస్‌ అధికారుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు స్వర్ణలత డిమాండ్‌ చేశారు. జిల్లా ఎస్పీ కార్యాలయ సమావేశ మందిరంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అయ్యన్నపాత్రుడు తన రాజకీయ ఉనికిని కాపాడుకునేందుకు తరచూ పోలీసులను దుర్భాషలాడుతున్నారన్నారు. పోలీసులు ఏమి పీకుతారంటున్న ఆయన ప్రజలకు రక్షణ, న్యాయం అందించడమే వారు పీకే పని అని తెలుసుకోవాలన్నారు. రాజకీయ పార్టీలకు తాము పనిచేయబోమని, ఏ ప్రభుత్వం అధికారంలో వుంటే అందులో పని చేస్తామన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో కూడా పనిచేసింది తామేనని పేర్కొన్నారు. అయ్యన్నపాత్రుడుపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులను కోరామన్నారు. కనీసం పోలీసులకు బహిరంగంగా క్షమాపణలు చెప్పేలా అయినా చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో సంఘం నాయకులు శేషగిరి, లలిత, శేషాద్రి కోటేశ్వరరావు, అనిల్‌ పాల్గొన్నారు.


Updated Date - 2021-11-26T05:54:40+05:30 IST