నకిలీ పట్టాలపై టీడీపీ నిరసన

ABN , First Publish Date - 2021-01-14T05:12:20+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ పట్టాల స్థానంలో అర్హులైన పేద ప్రజలకు భూ పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు.

నకిలీ పట్టాలపై టీడీపీ నిరసన
నకిలీ పట్టాలను భోగి మంటల్లో వేస్తున్న టీడీపీ నాయకులు

గాజువాక: రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నకిలీ పట్టాల స్థానంలో అర్హులైన పేద ప్రజలకు భూ పట్టాలు ఇవ్వాలని టీడీపీ నాయకుడు, మాజీ కార్పొరేటర్‌ పల్లా శ్రీనివాసరావు డిమాండ్‌ చేశారు. గాజువాక పార్టీ కార్యాలయంలో బుధవారం  భోగి మంటల్లో పత్రాలు వేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నకిలీ పట్టాలను ఇచ్చి ప్రజలను మోసం చేస్తున్నదని ఆరోపించారు. కార్యక్రమంలో మహ్మద్‌ రఫీ, పప్పు శంకరరావు, వాసు, కోగంటి లెనిన్‌బాబు, దశేంద్ర, బొండా జగన్‌ పాల్గొన్నారు. పెదగంట్యాడలో జరిగిన కార్యక్రమంలో పులి వెంకట రమణారెడ్డి, నామాల పెంటయ్య, గంగరాజు పాల్గొన్నారు. 

Updated Date - 2021-01-14T05:12:20+05:30 IST