పేదల సొంత ఇంటి కల నెరవేరుస్తాం
ABN , First Publish Date - 2021-01-12T05:56:39+05:30 IST
పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు.

మంత్రులు కురసాల, ముత్తంశెట్టి
గాజువాక: అర్హత కలిగిన ప్రతి పేద కుటుంబానికి సొంతింటి కలను నెరవేర్చాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ముందుకు సాగుతున్నారని జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావులు అన్నారు. జీవీఎంసీ 74వ వార్డు పరిధి టీఎన్‌ఆర్ ఫంక్షన్ హాల్‌లో సోమవారం జరిగిన ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమానికి మంత్రులు ముఖ్య అతిఽథిగా హాజరై మాట్లాడారు. ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ప్రభుత్వ సంక్షేమ పఽథకాలను అర్హులైన ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ గాజువాక నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్నామన్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ డి.శ్రీధర్, ఏపీడీ రజిని, మాజీ ఎమ్మెల్యే తిప్పల గురుమూర్తిరెడ్డి, నాయకులు తిప్పల దేవన్‌రెడ్డి, తిప్పల వంశీరెడ్డి, మంత్రి రాజశేఖర్, పల్లా చినతల్లి, ఇమ్రాన్, ఉరుకూటి చందు, సుజాత, దొడ్డి రమణ పాల్గొన్నారు.