జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె నోటీసు

ABN , First Publish Date - 2021-05-25T05:10:43+05:30 IST

జీవీఎంసీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జూన్‌ 4 తరువాత సమ్మె చేపడతామంటూ జీవీఎంసీ కమిషనర్‌ సృజన, మేయర్‌ జి.హరివెంకట కుమారిలకు సోమవారం కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు.

జీవీఎంసీ కాంట్రాక్టు కార్మికుల సమ్మె నోటీసు
మేయర్‌కు సమ్మె నోటీసు అందజేస్తున్న జీవీఎంసీ కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ ప్రతినిధులు

గాజువాక, మే 24: జీవీఎంసీ కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ కార్మికుల సమస్యల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నిరసిస్తూ జూన్‌ 4 తరువాత సమ్మె చేపడతామంటూ జీవీఎంసీ కమిషనర్‌ సృజన, మేయర్‌ జి.హరివెంకట కుమారిలకు సోమవారం కాంట్రాక్టు వర్కర్స్‌ యూనియన్‌ నాయకులు సమ్మె నోటీసు అందజేశారు. యూనియన్‌ అధ్యక్షుడు జి.సుబ్బారావు నేతృత్వంలో నాయకులు మేయర్‌, కమిషనర్‌లను కలసి తమ సమస్యలు విన్నవించారు. కొవిడ్‌ నుంచి మునిసిపల్‌ కార్మికుల ప్రాణాలకు రక్షణ కల్పించాలని, కొవిడ్‌తో మృతిచెందిన వారికి రూ.50 లక్షలు ఇవ్వాలని కోరారు. 

Updated Date - 2021-05-25T05:10:43+05:30 IST