57వ వార్డులో జీవీఎంసీ కమిషనర్‌ పర్యటన

ABN , First Publish Date - 2021-08-22T04:47:05+05:30 IST

జీవీఎంసీ 57వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శనివారం పర్యటించారు. తుమ్మడిపాలెంలో పలు సమస్యలను గుర్తించారు.

57వ వార్డులో జీవీఎంసీ కమిషనర్‌ పర్యటన
చెత్త సేకరణ వివరాలను అడిగి తెలుసుకుంటున్న కమిషనర్‌ డాక్టర్‌ సృజన

ఆర్పీపేట, ఆగస్టు 21 : జీవీఎంసీ 57వ వార్డు పరిధిలోని పలు ప్రాంతాల్లో జీవీఎంసీ కమిషనర్‌ డాక్టర్‌ జి.సృజన శనివారం పర్యటించారు. తుమ్మడిపాలెంలో పలు సమస్యలను గుర్తించారు. పారిశుధ్యం, తడి, పొడి చెత్త సేకరణపై ఆరా తీశారు. సీజనల్‌ వ్యాధులు  ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వార్డులో చెత్త నిల్వలు పేరుకుపోకుండా తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జోనల్‌ కమిషనర్‌ మల్లయ్య నాయుడు,  ఈఈ ఎస్‌.చిరంజీవి, సీఎంవో డాక్టర్‌ శాస్ర్తి, ఏఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజేశ్‌,  డాక్టర్‌ రాజేశ్‌, వార్డు కార్పొరేటర్‌ ముర్రువాణి నానాజీ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-08-22T04:47:05+05:30 IST