కాలువల్లో పూడిక తొలగింపు

ABN , First Publish Date - 2021-05-06T05:06:16+05:30 IST

జీవీఎంసీ 42వ వార్డు రెల్లివీధి, జగన్నాథపురం తదితర ప్రాంతాల్లోని గెడ్డల్లో బుధవారం జీవీఎంసీ సిబ్బంది పూడిక తొలగించారు.

కాలువల్లో పూడిక తొలగింపు
ఎక్సాకవేటర్‌ ఉపయోగించి పూడిక తొలగిస్తున్న దృశ్యం

ఎక్సాకవేటర్‌ ఉపయోగించి జీవీఎంసీ సిబ్బంది చర్యలు

తాటిచెట్లపాలెం : జీవీఎంసీ 42వ వార్డు రెల్లివీధి, జగన్నాథపురం తదితర ప్రాంతాల్లోని గెడ్డల్లో బుధవారం జీవీఎంసీ సిబ్బంది పూడిక తొలగించారు. ఎక్సాకవేటర్‌ను గెడ్డలోకి దించి పూడక తొలగింపు చేపట్టారు. వార్డు కార్పొరేటర్‌ ఆళ్ల లీలావతి, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ ఎస్‌.పి.వెంకటేశ్వరన్‌ పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రధాన కూడళ్లు, రోడ్లు, శుభ్రం చేయించారు.

Updated Date - 2021-05-06T05:06:16+05:30 IST