ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల మహా స్వచ్ఛ భారత్‌

ABN , First Publish Date - 2021-03-14T05:44:40+05:30 IST

ఎంవీపీ కాలనీ రైతుబజారు, ఆర్టీసీ బస్‌ డిపో ఆవరణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వ ర్యంలో శనివారం మహా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్ల మహా స్వచ్ఛ భారత్‌
స్వచ్ఛ భారత్‌తో పాల్గొన్న ఏయూ రిజిస్ట్రార్‌ కృష్ణమోహన్‌తో పాటు వలంటీర్లు

ఎంవీపీ కాలనీ, మార్చి 13: ఎంవీపీ కాలనీ రైతుబజారు, ఆర్టీసీ బస్‌ డిపో ఆవరణలో ఆంధ్ర విశ్వవిద్యాలయం ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వ ర్యంలో శనివారం మహా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఏయూ రిజిస్ట్రార్‌ వి.కృష్ణమోహన్‌ ప్రారంభించారు. ఎన్‌ఎస్‌ఎస్‌ వలంటీర్లు, విద్యార్థులు ఎంవీపీ కాలనీ రైతుబజారు, ఆర్టీసీ డిపోలో శ్రమదానం చేసి చెత్తాచెదారాన్ని తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కృష్ణమోహన్‌ మాట్లాడుతూ యువత స్వచ్ఛ భారత్‌ నిర్మాణంలో కీలక పాత్ర పోషించి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జీవీఎంసీ ముఖ్య వైద్యాధికారి డాక్టర్‌ శాస్త్రి, ఎన్‌ఎస్‌ఎస్‌ రాష్ట్ర శిక్షణ సంస్థ సమన్వయకర్త డాక్టర్‌ పి.రామచంద్రయ్య, ప్రొగ్రామ్‌ కో-ఆర్డినేటర్‌ హరనాథ్‌, ప్రతినిధి కేసీ రెడ్డి, అప్పలనాయుడు, గంగాధర్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2021-03-14T05:44:40+05:30 IST