నర్సీపట్నం ఆర్డీవోగా గోవిందరావు

ABN , First Publish Date - 2021-08-21T05:49:03+05:30 IST

నర్సీపట్నం ఆర్డీవోగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా అండ్‌ సంక్షేమం) రోణంకి గోవిందరావు నియమితులయ్యారు.

నర్సీపట్నం ఆర్డీవోగా గోవిందరావు

విశాఖపట్నం, ఆగస్టు 20 (ఆంధ్రజ్యోతి): నర్సీపట్నం ఆర్డీవోగా జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ (ఆసరా అండ్‌ సంక్షేమం) రోణంకి గోవిందరావు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రస్తుతం ఏపీఐఐసీ డిప్యూటీ కలెక్టర్‌ అనిత నర్సీపట్నం ఇన్‌చార్జి ఆర్డీవోగా ఉన్నారు. ఆర్డీవోగా బదిలీ అయిన గోవిందరావు స్థానంలో ఇంకెవరినీ ప్రభుత్వం నియమించలేదు. కాగా 2019 ఎన్నికల ముందు నుంచి ఏడాదిపాటు గోవిందరావు నర్సీపట్నం ఆర్డీవోగా పనిచేశారు. తిరిగి నర్సీపట్నం ఆర్డీవోగా గోవిందరావును నియమించడం గమనార్హం. 

Updated Date - 2021-08-21T05:49:03+05:30 IST