ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం

ABN , First Publish Date - 2021-12-07T06:09:17+05:30 IST

ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి, పేద, మధ్య తరగతివారిపై ఆర్థిక భారం మోపడమే అజెండాగా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మునిసిపాలిటీలోని పెదపల్లి, మంత్రిపాలెం వార్డుల్లో సోమవారం ఏర్పాటైన ఆత్మగౌరవ సభల్లో మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికార పీఠం ఎక్కిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వ్యవస్థలు, సంస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు.

ప్రజా సంక్షేమం పట్టని ప్రభుత్వం
అంబేడ్కర్‌ పాదాల వద్ద వినతిని ఉంచుతున్న ప్రగడ, పప్పల

  ఆత్మగౌరవ సభల్లో టీడీపీ నాయకులు నాగేశ్వరరావు, చలపతిరావు 

ఎలమంచిలి, డిసెంబరు 6: ప్రజా సంక్షేమం గాలికి వదిలేసి, పేద, మధ్య తరగతివారిపై ఆర్థిక భారం మోపడమే అజెండాగా రాష్ట్రంలో వైసీపీ పాలన సాగుతోందని టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ ప్రగడ నాగేశ్వరరావు అన్నారు. మునిసిపాలిటీలోని పెదపల్లి, మంత్రిపాలెం వార్డుల్లో సోమవారం ఏర్పాటైన ఆత్మగౌరవ సభల్లో మాట్లాడారు. ఒక్క ఛాన్స్‌ అంటూ అధికార పీఠం ఎక్కిన వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్ని వ్యవస్థలు, సంస్థలను భ్రష్టుపట్టిస్తున్నారని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్సీ పప్పల చలపతిరావు మాట్లాడుతూ వైసీపీ పాలనలో ఏ వర్గమూ సంతృప్తిగా లేదన్నారు. అనంతరం దిమిలి రోడ్డు జంక్షన్‌ వద్ద అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాల వేసిన నివాళులర్పించిన అనంతరం, సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని ఆయన పాదాల వద్ద ఉంచారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు గొర్లె నానాజీ ఆధ్వర్యంలో   జరిగిన ఈ కార్య క్రమంలో పార్టీ మండల మాజీ అధ్యక్షుడు కాండ్రకోట చిరంజీవి, మండల ఇన్‌చార్జ్‌ నాయుడు, నాయకులు ఆర్‌.ఎస్‌. నాగేశ్వరరావు, మాజీ కౌన్సిలర్‌ బొద్దపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-12-07T06:09:17+05:30 IST