పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం

ABN , First Publish Date - 2021-10-07T06:10:30+05:30 IST

పాడి రైతులకు ప్రభు త్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌ పేర్కొన్నారు. మండలంలోని మలునా యుడుపాలెంలో బుధవారం పశు సంవర్థకశాఖ ఏడీ డాక్టర్‌ సజ్జ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాడి రైతులకు రాయితీపై సమీకృత దాణా పంపిణీ జరిగింది. కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించి, మాట్లాడుతూ ప్రభుత్వం 60 శాతం రాయితీతో అందిస్తున్న సమీకృత దాణాను సద్విని యోగం చేసుకోవాలని సూచించారు.

పాడి రైతులకు ప్రభుత్వ ప్రోత్సాహం
పాడి రైతులకు సమీకృత దాణా పంపిణీ చేస్తున్న ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

 ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌

సబ్బవరం, అక్టోబరు 6: పాడి రైతులకు ప్రభు త్వం ప్రోత్సాహకాలను అందిస్తోందని ఎమ్మెల్యే అన్నం రెడ్డి అదీప్‌రాజ్‌ పేర్కొన్నారు. మండలంలోని మలునా యుడుపాలెంలో బుధవారం పశు సంవర్థకశాఖ ఏడీ డాక్టర్‌ సజ్జ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో పాడి రైతులకు రాయితీపై సమీకృత దాణా పంపిణీ జరిగింది. కార్య క్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఎమ్మెల్యే ప్రచార పోస్టర్‌ ఆవిష్కరించి, మాట్లాడుతూ ప్రభుత్వం 60 శాతం రాయితీతో అందిస్తున్న సమీకృత దాణాను  సద్విని యోగం చేసుకోవాలని సూచించారు. 50 టన్నుల సమీకృత దాణా సిద్ధంగా ఉందని ఏడీ తెలిపారు. కార్యక్రమంలో జడ్పీ వైస్‌చైర్మన్‌ తుంపాల అప్పా రావు, ఎంపీపీ బోకం సూర్యకుమారి, రామునాయుడు, కొటాన రాము, సర్పంచ్‌ బోను దేముడమ్మ, గంగునా యుడు, ఎంపీటీసీ సభ్యుడు గొర్లి కనకరాజు,  అప్పా రావు, నారాయణమూర్తి, మండల ప్రత్యేకా ధికారి నాగ మల్లేశ్వరరావు, డీడీ కరుణాకరరావు, ఏవో బాబూరావు, తహసీల్దార్‌ రమాదేవి, పశువైద్యులు సంధ్య, సౌజన్య పాల్గొన్నారు.  

Updated Date - 2021-10-07T06:10:30+05:30 IST