ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దాలి
ABN , First Publish Date - 2021-11-26T05:57:00+05:30 IST
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రిన్సిపాళ్లు పనిచేయాలని ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సూచించారు.

ప్రిన్సిపాళ్ల సమావేశంలో ఏయూ వీసీ ప్రసాదరెడ్డి
ఏయూ క్యాంపస్, నవంబరు 25: ప్రభుత్వ డిగ్రీ కళాశాలలను ఆదర్శంగా తీర్చిదిద్దే దిశగా ప్రిన్సిపాళ్లు పనిచేయాలని ఏయూ వీసీ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాదరెడ్డి సూచించారు. గురువారం ఏయూ మానవ వనరుల అభివృద్ధి కేంద్రంలో కమిషనరేట్ ఆఫ్ కాలేజ్‌యేట్ ఎడ్యుకేషన్ సహకారంతో నిర్వహిస్తున్న ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లకు కెపాసిటీ బిల్డింగ్ శిక్షణ తరగతులను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రస్తుతం సమాజంతో అనుసంధానం అవుతూ పనిచేయడం ఎంతో అవసరమని, ఈ ప్రక్రియలో కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులను కూడా భాగ్యస్వాములను చేయాలన్నారు. ప్రతీఒక్కరూ ఆత్మావలోకనం చేసుకుంటూ తమ విధి నిర్వహణలో విలువలను జోడించి పనిచేయాలని కోరారు. కాలేజ్‌యేట్ ఎడ్యుకేషన్ కమిషనర్ డాక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ నాణ్యమైన విద్యతో పాటు ఉన్నత విద్యను అందరికీ చేరువ చేయడం ఎంతో అవసరమన్నారు. పిన్సిపాళ్లంతా తమ సామర్థ్యాలను మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏయూ సైన్స్ కళాశాల పిన్సిపాల్ శ్రీనివాసరావు, పాల్, డాక్టర్ సూరజ్ నాయర్, తదితరులు పాల్గొన్నారు.