పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు

ABN , First Publish Date - 2021-02-01T07:01:50+05:30 IST

రానున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తాదని ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు.

పంచాయతీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలు
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్న బీజేపీ ఎమ్మెల్సీ మాధవ్‌


ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ 

పాడేరురూరల్‌: రానున్న పంచాయతీ ఎన్నికల్లో జనసేనతో కలిసి ముందుకు వెళుతున్న బీజేపీ మంచి ఫలితాలను సాధిస్తాదని ఎమ్మెల్సీ పీవీఎన్‌.మాధవ్‌ అన్నారు. ఆదివారం పాడేరులో నిర్వహించిన పాడేరు, అరకు నియోజకవర్గాల బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ..పంచాయతీ ఎన్నికల్లో వైసీపీకి చుక్కెదురు తప్పదన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులు, అమలు చేస్తున్న పథకాలను వైసీపీ ప్రభుత్వం తన ఖజానాలో వేసుకొని రాష్ట్ర ప్రజలను మభ్యపెడుతుందన్నారు. పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ, జనసేన బలపరిచిన అభ్యర్థుల విజయానికి రెండు పార్టీల కార్యకర్తలు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ మధుకర్‌జీ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లోకుల్‌గాంధీ, అరకు, పాడేరు బీజేపీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు, అడపా బొంజునాయుడు, సల్లా రామకృష్ణ, కె.కృష్ణారావు, పి.రాజారావు, పి.రవికుమార్‌ తదితరులు పాల్గొన్నారు.


Updated Date - 2021-02-01T07:01:50+05:30 IST