సింహాచలేశునికి స్వర్ణ పుష్పార్చన
ABN , First Publish Date - 2021-12-27T05:34:17+05:30 IST
సింహాద్రి అప్పన్న స్వామికి ఆదివారం ఘనంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు.
సింహాచలం, డిసెంబరు 26: సింహాద్రి అప్పన్న స్వామికి ఆదివారం ఘనంగా స్వర్ణ పుష్పార్చన నిర్వహించారు. ఇందులో భాగంగా సుప్రభాత సేవతో స్వామివారిని మేల్కొలిపి ప్రభాత ఆరాధనలు యథావిధిగా జరిపాక ఉత్సవమూర్తి గోవిందరాజస్వామిని ఉభయ దేవేరులతో కల్యాణ మండపంలో వుంచి భక్తుల గోత్ర నామాలతో అర్చకులు పూజలు చేసి నృసింహ అష్టోత్తర శతనామావళితో స్వర్ణ సంపెంగలతో స్వామిని అర్చించారు. కాగా అప్పన్న నిత్యాన్న ప్రసాద పథకానికి పశ్చిమగోదావరి జిల్లా మార్టేరుకు చెందిన వెలగల నాగమురళీ రూ.లక్ష విరాళంగా సమర్పించారు.