ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు
ABN , First Publish Date - 2021-08-31T06:20:03+05:30 IST
కృష్ణాష్టమి వేడుకలను సోమవారం జిల్లావాసులు ఘనంగా జరుపుకున్నారు.
కృష్ణాష్టమి వేడుకలను సోమవారం జిల్లావాసులు ఘనంగా జరుపుకున్నారు. నగరంలోని ఇస్కాన్ మందిరంలో కృష్ణుడికి 108
కలశాలతో ప్రత్యేక అభిషేకాలు చేశారు. 108 రకాల పిండివంటలను
రాజభోగంగా సమర్పించారు. ఆ తర్వాత ఉయ్యాల ఉత్సవం జరిపారు.
సాయంత్రం 108 దీపాలతో మహాహారతినిచ్చారు . - సాగర్‌నగర్