ఆగస్టు 27 నుంచి గీతం న్యాయ కళాశాల మూట్ కోర్టు పోటీలు
ABN , First Publish Date - 2021-07-08T06:28:18+05:30 IST
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఆగస్టు 27 నుంచి జాతీయ స్థాయి మూట్ కోర్టు పోటీలు నిర్వహిస్తామని డైరెక్టర్ ప్రొఫెసర్ అనితారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

సాగర్‌నగర్, జూలై 7: గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం స్కూల్ ఆఫ్ లా ఆధ్వర్యంలో ఆగస్టు 27 నుంచి జాతీయ స్థాయి మూట్ కోర్టు పోటీలు నిర్వహిస్తామని డైరెక్టర్ ప్రొఫెసర్ అనితారావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. గీతం మూట్, అడ్వకసీ కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 27 నుంచి 29వ తేదీ వరకు గీతం వ్యవస్థాపక అధ్యక్షుడు దివంగత డాక్టర్ ఎంవీవీఎస్ మూర్తి పేరుతో ఈ పోటీలను వర్చువల్ విధానంలో ప్రముఖ న్యాయ నిపుణుల పర్యవేక్షణలో నిర్వహిస్తామన్నారు. ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సులు అభ్యసించే విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనవచ్చునని, ప్రతి న్యాయ కళాశాల నుంచి ఒక జట్టును మాత్రమే అనుమతిస్తామని పేర్కొన్నారు. విజేతలకు నగదు బహుమతి, ప్రశంసాపత్రాలను అందజేస్తామని, ఆసక్తి గల న్యాయ కళాశాలలు ఈనెల 31వ తేదీలోగా గీతం స్కూల్ ఆఫ్ లా మూట్ కోర్టు పోటీల నిర్వహక కమిటీని సంప్రతించాలని కోరారు.