గంజాయి తోటలను ధ్వంసం చేసిన గిరిజనులు
ABN , First Publish Date - 2021-10-21T06:15:56+05:30 IST
గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు.

పది ఎకరాల్లో మొక్కలు పీకివేత
సీలేరు, అక్టోబరు 20: గూడెంకొత్తవీధి మండలం గుమ్మిరేవుల పంచాయతీ పరిధిలో పలు గ్రామాల్లో గిరిజనులు స్వచ్ఛందంగా గంజాయి తోటలను ధ్వంసం చేశారు. స్థానిక గిరిజన నాయకుడు మార్కురాజు ఆధ్వర్యంలో బుధవారం చెరుకుమళ్లు, నేలజర్త, పెద్దవీధి, పాతవీధి, కనుసుమెట్ట గ్రామాల్లో సుమారు పది ఎకరాల్లో గంజాయి మొక్కలను నరికివేశారు. తమ పంచాయతీ పరిధిలో గంజాయి సాగు లేకుండా చేస్తామని మార్కురాజు తెలిపారు. కాగా గంజాయి సాగు, రవాణాకు గిరినులు దూరంగా ఉండాలని ఎస్‌ఐ రంజిత్ చెప్పారు. ధారకొండ పంచాయతీ కేంద్రంలో గిరిజనులతో మాట్లాడుతూ, ఆదివాసీ యువత గంజాయి కేసుల్లో ఇరుక్కుని విలువైన జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారని అన్నారు.