కరోనా మృతులకు అంత్యక్రియలు
ABN , First Publish Date - 2021-05-22T04:00:11+05:30 IST
కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో నేను సైతం అంటూ ముందుకు వచ్చి సేవలందించారు స్థానిక నాయకుడు పల్లా దుర్గారావు.

మానవత్వం చాటుకుంటున్న దుర్గారావు
రామ్‌నగర్, మే 21: కరోనాతో మృతిచెందిన వ్యక్తికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ఎవరూ లేకపోవడంతో నేను సైతం అంటూ ముందుకు వచ్చి సేవలందించారు స్థానిక నాయకుడు పల్లా దుర్గారావు. 28వ వార్డు పితాని వీధికి చెందిన నెమళ్ళ శ్రీనివాస్ కరోనా బారిన పడి శుక్రవారం మృతిచెందాడు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఇంట్లో మగవారెవరూ లేకపోవడం, వైరస్‌కు భయపడి ఇతరులెవరూ రాకపోవడంతో దుర్గారావు జీవీఎంసీ అధికారుల సహాయంతో అతడి మృతదేహాన్ని శ్మశానవాటికకు తరలించి, అంత్యక్రియలు నిర్వహించారు. ఇప్పటివరకు తన సొంత నిధులతో ఇలా కొవిడ్ మృతులకు అంత్యక్రియలు నిర్వహిస్తూ పలువురి మన్ననలు పొందుతున్నారు.