స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు

ABN , First Publish Date - 2021-02-26T05:43:30+05:30 IST

స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకోవడంలో భాగంగా షిప్‌యార్డు కార్మిక సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని గుర్తింపు యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంటిబాబు, ఎంవీ రమణమూర్తిలు తెలిపారు.

స్టీల్‌ప్లాంట్‌ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు
సంఘీభావం తెలుపుతున్న షిప్‌యార్డు జేఏసీ ప్రతినిధులు

షిప్‌యార్డు జేఏసీ ప్రకటన 

మల్కాపురం, ఫిబ్రవరి 25 : స్టీల్‌ప్లాంట్‌ను పరిరక్షించుకోవడంలో భాగంగా షిప్‌యార్డు కార్మిక సంఘాల నుంచి సంపూర్ణ మద్దతు ఉంటుందని గుర్తింపు యూనియన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు చంటిబాబు, ఎంవీ రమణమూర్తిలు తెలిపారు. గురువారం షిప్‌యార్డు గుర్తింపు యూనియన్‌ ఆధ్వర్యంలో షిప్‌యార్డు జేఏసీ ఏర్పడిందన్నారు. అయితే ఈ జేఏసీలో బీఎంఎస్‌ యూనియన్‌ లేదన్నారు. ఇకపై స్టీల్‌ప్లాంట్‌ కార్మిక సంఘాలు చేస్తున్న ప్రతి ఉద్యమ కార్యక్రమంలో తాము కూడా పాల్గొని మద్దతు తెలియజేస్తామని తెలిపారు. ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడుకోవాలని, లేకుంటే భవిష్యత్తు ఉండదన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. 


సీపీఐ ఆందోళన 

విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తే సహించేది లేదని సీపీఐ నాయకులు సత్యాంజనేయ, రాంబాబు హెచ్చరించారు. మల్కాపురం ప్రధాన కూడలిలో గురువారం ఆందోళన చేశారు. స్టీల్‌ప్లాంట్‌ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తోందని, గ్యాస్‌, పెట్రో ధరలను కూడా విపరీతంగా పెంచేసిందని ధ్వజమెత్తారు.

Updated Date - 2021-02-26T05:43:30+05:30 IST