వెంకన్న కల్యాణానికి ఉపమాక ముస్తాబు

ABN , First Publish Date - 2021-03-22T06:07:26+05:30 IST

ఉపమాక క్షేత్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు ఊపందు కున్నాయి.

వెంకన్న కల్యాణానికి ఉపమాక ముస్తాబు
ఆలయం ఆవరణలో భక్తులకు ఎండతీవ్రత తగలకుండా నిర్మించిన విశాలమైన రేకుల షెడ్డు

  

టీటీడీ ఆధ్వర్యంలో నిర్వహణ 

రాజగోపురం ఎదురుగా షెడ్డు నిర్మాణం 

 క్యూ లైన్లు సిద్ధం 

 బందో బస్తు ఏర్పాట్లు పరిశీలించిన సీఐ 

 వేడుకకు హాజరు కావాలని ఎమ్మెల్యేకు ఆహ్వానం 


నక్కపల్లి, మార్చి 21 : ఉపమాక క్షేత్రంలో మంగళవారం నుంచి ప్రారంభం కానున్న వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణోత్సవాలకు ఏర్పాట్లు ఊపందు కున్నాయి. ఆలయ ప్రధాన రాజగోపురం ఎదురుగా విశాలమైన రేకుషెడ్డు నిర్మిస్తున్నారు. క్యూ లైన్ల ఏర్పాటు చేశారు. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రానున్న నేపథ్యంలో ఉపమాక గ్రామ ప్రధాన రహదారికి ఆనుకుని వున్న రెండు చెరువు గట్లపై, పుష్కరిణి చుట్టూ ఫెన్సింగ్‌ ఏర్పాటు చేశారు.  25న కల్యాణోత్సవం రోజున స్నానాల రేవుల  వద్ద మాత్రం అధిక సంఖ్యలో భక్తులు స్నానాలాచరిస్తారు. ఆలయానికి ఎదురుగా వున్న చోరమండపం వద్ద తిరుపతి లడ్డూ ప్రసాదాలు విక్రయిం చనున్నారు.  ఇదిలావుంటే, కల్యాణోత్సవాల్లో బందోబస్తు ఏర్పాట్లు తదితరాలపై సీఐ విజయ్‌కుమార్‌ ఆలయాన్ని పరిశీలించారు.  పుష్కరిణిలో స్నానాల ఘాట్ల వద్ద చేపట్టాల్సిన చర్యలను వివరించారు.  అనంతరం ఆలయ అధికారులతో చర్చించారు. 

ఎమ్మెల్యే బాబూరావుకు టీటీడీ ఆహ్వానం

ఎస్‌.రాయవరం: వెంకన్న కల్యాణోత్సవాలకు హాజ రు కావాలంటూ కొరుప్రోలులో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు టీటీడీ అధికారులు ఆదివారం ఆహ్వానం పలికారు. సూపరింటెండెంట్‌ మునిమోహన్‌, ఆలయ ఇన్‌స్పెక్టర్‌ పృథ్వీ, ప్రధానార్చకులు ప్రసాదాచార్యులు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. డీసీసీబీ మాజీ డైరెక్టర్‌ వీసం రామకృష్ణ, కొప్పిశెట్టి హరిబాబు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2021-03-22T06:07:26+05:30 IST