గోవాడ షుగర్స్‌కు సంపూర్ణ సహకారం

ABN , First Publish Date - 2021-12-19T06:10:35+05:30 IST

గోవాడ సహకార చక్కెర కర్మాగారానికి సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌ ఝాన్సీ తెలిపారు.

గోవాడ షుగర్స్‌కు సంపూర్ణ సహకారం
విలేకరులతో మాట్లాడుతున్న ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌ ఝాన్సీ, పక్కన ఎమ్మెల్యే ధర్మశ్రీ, ఎంపీ సత్యవతి

ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌ ఝాన్సీ 


చోడవరం, డిసెంబరు 18: గోవాడ సహకార చక్కెర కర్మాగారానికి సంపూర్ణ సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నామని ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌ ఝాన్సీ తెలిపారు. శనివారం ఫ్యాక్టరీని సందర్శించి అధికారులతో చర్చించారు. అనంతరం విలేరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, 25 వేల మంది సభ్య రైతులు గల ఈ ఫ్యాక్టరీ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. షుగర్‌ ఫ్యాక్టరీ అనుబంధ ఉత్పత్తుల తయారీపై దృష్టిసారించి స్వయం సమృద్ధి సాధించేలా చూడాలని సూచించారు. ఎమ్మెల్యే ధర్మశ్రీ మాట్లాడుతూ, ఫ్యాక్టరీ అప్పులపై ఆప్కాబ్‌కు సకాలంలో అప్పు తీర్చి వడ్డీ భారం తగ్గించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. ఎంపీ డాక్టర్‌ సత్యవతి మాట్లాడుతూ, ఆప్కాబ్‌ అధికారులు ఫ్యాక్టరీ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని అవసరమైన సహాయ సహకారాలు అందించాలని విజ్ఞప్తి చేశారు. ఎండీ వి.సన్యాసినాయుడు ఫ్యాక్టరీ ఆర్థిక పరిస్థితిని ఆప్కాబ్‌ చైర్‌పర్సన్‌, ఎంపీ, ఎమ్మెల్యేలకు వివరించారు. ఈ కార్యక్రమంలో అనంతపురం డీసీసీబీ చైర్‌పర్సన్‌ లిఖిత, ఆప్కాబ్‌ అధికారులు, బుచ్చెయ్యపేట జడ్పీటీసీ సభ్యుడు దొండా రాంబాబు, డీసీసీడీ డైరెక్టర్‌ మూడెడ్ల మహలక్ష్మీశంకర్‌, స్థానిక నాయకుడు ఏడువాక సత్యారావు పాల్గొన్నారు. 

Updated Date - 2021-12-19T06:10:35+05:30 IST