అ‘పూర్వ’ సమ్మేళనం

ABN , First Publish Date - 2021-01-12T05:30:00+05:30 IST

అనకాపల్లి ఏఎంఏఏ హైస్కూల్‌లో మంగళవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది.

అ‘పూర్వ’ సమ్మేళనం
ఏఎంఏఏ హైస్కూల్‌లో పూర్వ విద్యార్థులు

రెండు దశాబ్దాల తర్వాత ఒక చోట కలిసిన 

ఏఎంఏఏ హైస్కూల్‌ విద్యార్థులు


అనకాపల్లి, జనవరి 12: అనకాపల్లి ఏఎంఏఏ హైస్కూల్‌లో మంగళవారం పూర్వ విద్యార్థుల సమ్మేళనం జరిగింది. ఇరవై ఏళ్ల క్రితం పాఠశాలలో పదో తరగతి చదివిన విద్యార్థులు ఇంజనీరింగ్‌, పీజీలు పూర్తిచేసి దేశ, విదేశాల్లో వివిధ హోదాల్లో స్థిరపడ్డారు. వారంతా సంక్రాంతి సందర్భంగా స్వగ్రామాలకు వచ్చి పాఠశాల ఆవరణలో కలుసుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. తమ గురువులను సత్కరించారు. 

Updated Date - 2021-01-12T05:30:00+05:30 IST