జాతీయ మాజీ కబడ్డీ క్రీడాకారుడు అప్పారావు మృతి

ABN , First Publish Date - 2021-11-22T04:57:21+05:30 IST

నగరానికి చెందిన జాతీయ మాజీ కబడ్డీ క్రీడాకారుడు, రిఫరీ ఎన్‌.అప్పారావు (73) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు.

జాతీయ మాజీ కబడ్డీ క్రీడాకారుడు అప్పారావు మృతి
అప్పారావు

విశాఖపట్నం (స్పోర్ట్సు), నవంబరు 21: నగరానికి చెందిన జాతీయ మాజీ కబడ్డీ క్రీడాకారుడు, రిఫరీ ఎన్‌.అప్పారావు (73) ఆదివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. క్రీడాకారుడిగా రాణించిన అప్పారావు కబడ్డీ క్రీడకు విశేష సేవలందించారు. నేవల్‌ డాక్‌యార్డులో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందిన తరువాత పూర్తిగా కబడ్డీ క్రీడాభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలందించారు. ఆయన మృతికి రాష్ట్ర కబడ్డీ సంఘం సంయుక్త కార్యదర్శి ఉరుకూటి శ్రీనివాసరావు, జిల్లా సంఘం కార్యదర్శి కార్యదర్శి రాజేశ్వరి, ఇతర ప్రతినిధులు, క్రీడాకారులు, రీఫరీలు సంతాపం ప్రకటించారు. 

Updated Date - 2021-11-22T04:57:21+05:30 IST